స్మార్ట్ ఫోన్లు 2 ఫ్రిజ్‌ల వ‌ర‌కూ.. 5 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్‌ || Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale | స్మార్ట్ ఫోన్ల నుంచి రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మిషన్ల వరకు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్-2023 వచ్చింది. ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.


Amazon Great Freedom Festival Sale | ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌-2023 తీసుకొచ్చింది. ఆగ‌స్టు ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఈ సేల్ ఆఫ‌ర్ న‌డుస్తుంది. అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు నాలుగో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌మకు అవ‌స‌ర‌మైన వ‌స్తువులు.. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు, వాషింగ్ మిష‌న్లు, రిఫ్రిజిరేట‌ర్లు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు ప్రీ-బుకింగ్ చేసుకుని డిస్కౌంట్ పొందొచ్చు.

ఎస్బీఐ క్రెడిట్ కార్డుతోపాటు ఈఎంఐ లావాదేవీల‌పై అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌-2023లో ప‌దిశాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్న‌ది. అంతే కాదు.. ఆయా ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు త‌దిత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ఎక్స్చేంజ్ మీద కూడా అద‌న‌పు డిస్కౌంట్లు ఇస్తుంది. అమెజాన్ త‌న వెబ్‌సైట్‌లో డీల్స్ లిస్ట్ చేస్తుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్‌, గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్‌, 8పీఎం డీల్స్‌, రూ.999లోపు డీల్స్‌, ప్రైష్ క్రాష్ స్టోర్ క్యాట‌గిరీల కింద క‌స్ట‌మ‌ర్ల‌కు డిస్కౌంట్లు పొందొచ్చు.

స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చిన అమెజాన్‌,, లాప్‌టాప్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మిష‌న్ల‌పైనా రాయితీ క‌ల్పించింది. అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు నెల‌కు రూ.299, మూడు నెల‌లకు రూ.599, ఏడాది స‌బ్‌స్క్రిప్ష‌న్ రూ.1499, అమెజాన్ ప్రైమ్ లైట్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఏడాదికి రూ.9999ల‌కు ల‌భిస్తుంది.

JOIN

Post a Comment

أحدث أقدم