తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన.

 తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పెండింగ్ అంశాలపై (Pending Issues) పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీకి..

Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పెండింగ్ అంశాలపై (Pending Issues) పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీకి (Andhra Pradesh) ఏమీ ఇవ్వకుండానే కేంద్రం చేతులు దులుపుకుంది. దీంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డికి (CM YS Jagan Reddy) బిగ్ ఝలక్ ఇచ్చినట్లయ్యింది. ముఖ్యంగా.. పెద్ద పోర్టుల ఏర్పాటు (Ports), కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant), విశాఖ రైల్వే జోన్‌పై (Visakha Railway Zone) కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా.. కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. రైల్వేజోన్ పైన కేంద్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతుండటం గమనార్హం. అయితే.. విభజన చట్టంలోని అనేక హామీలను ఇప్పటికే అమలు చేశామని కేంద్రం తేల్చి చెప్పింది. మరి కొన్ని హామీల అమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది.


New-Parliament.jpg

ఇంకా ఏమేం చెప్పిందంటే..?

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి నిర్ణీత కాల పరిమితిని విధించడం జరిగింది. ప్రత్యేక రైల్వే జోన్‌కు సౌత్‌కోస్ట్ రైల్వే‌జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు 2022 లో 106.89 కోట్ల తో మంజూరీ చేయడం జరిగింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గాను 10 కోట్లను విడుదల చేయడం జరిగింది. సమీప ప్రాంతాల్లో ఉన్న పోర్టులు నుండి గట్టి పోటీ ఉండటంతో దుగ్గరాజుపట్నంలో ప్రధాన ఓడరేవు ఏర్పాటు సాధ్యం కాలేదు. దుగ్గరాజుపట్నం బదులు రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం సూచించింది. రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై అయినందున ఏపీ ప్రభుత్వం మైనర్ పోర్టుగా డీనోటిఫై చేయాలని లేదా ఇందుకోసం మరో ప్రాంతాన్ని గుర్తించాలని సూచించడం జరిగింది. కడప జిల్లాలో సమీకృత స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి సాధ్యం కాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని హామీ మేరకు ఎయిమ్స్, ఐఐటి గిరిజన యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం కోసం ఇప్పటివరకు 21154.568 కోట్లు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలు, సమస్యలు, తదుపరి కార్యాచరణ కోసం... ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపిన కేంద్రం’ అని పార్లమెంట్ వేదికగా కేంద్రం తేల్చి చెప్పేసింది.

minister-nityanand.jpg

సమీక్షిస్తాం..!

‘ రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు పరిష్కారం కోసం సమయానుకూలంగా హోం శాఖ సమీక్షిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులతో 31 సమావేశాలు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. పెండింగ్ అంశాలను రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం అవుతాయి. వివాదాలు ఉన్న సమస్యల ఆమోదయోగ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది అని టీడీపీ ఎంపీలు కేశినేని, రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Minister Nityanand Rai) సవివరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపరిచిన అనేక అంశాలు అమలు చేశారని, మరికొన్ని ప్రాజక్టులు వివిధ దశల్లో ఉంది’ అని కేంద్ర హోం శాఖ పార్లమెంట్‌కు నివేదించింది. సో.. దీన్ని బట్టి చూస్తే.. ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వలేదు. దీంతో జగన్‌కు అన్ని వరుస షాక్‌లు తగిలాయని చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ బీజేపీ మంచి సత్సంబంధాలు కొనసాగించినప్పటికీ వైఎస్ జగన్ ఏమీ సాధించలేకపోయారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

JOIN

Post a Comment

కొత్తది పాతది