వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు?

 వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంపలాం, రేవు అంపలాం, వెదుళ్లవలస, పోలాకి, పల్లిపేట, సుసరాం, ప్రియాగ్రహారం, గొల్లలవలస, డోల, సంతలక్ష్మీ పురం, బెలమర పాలవలస, మొగివిల్లిపేట గ్రామాల్లోని పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది.

వారం రోజులుగా ముంపులోనే..
చెరువును తలపిస్తున్న ఎద సాగు పంట పొలాలు

రేవుఅంపలాం(పోలాకి): వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంపలాం, రేవు అంపలాం, వెదుళ్లవలస, పోలాకి, పల్లిపేట, సుసరాం, ప్రియాగ్రహారం, గొల్లలవలస, డోల, సంతలక్ష్మీ పురం, బెలమర పాలవలస, మొగివిల్లిపేట గ్రామాల్లోని పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. పొలాల్లో చేరిన నీరు బయటకు వెళ్లపో వడంతో నారు కుళ్లి కంపుకొడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు వల్ల నీటిలోని చేపలు ఎగిరి రోడ్డుపై పడుతున్నా యని బాటసారులు చెబుతున్నారు. ఎదలు సాగుచేసిన పంట పొలా లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. మండలంలోని సుమారు 1500 హెక్టార్లలో పొలాలు నీటిలో మునిగిపోయాయి. నీరు మళ్లించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ముంపు ఎద పొలాల్లో యూరియా చల్లాలి
నరసన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన వరి ఎద పొలాలకు నీరు తగ్గిన తరువాత మొదటి విడతగా ఎకరాకు 20 కేజీల వంతున యూరియా బూస్టర్‌ డోస్‌ వేయాలని వ్యవసాయాధికారి సునీత తెలిపారు. సుందరాపురం, చిక్కాలవలస, బాలసీమ, బసివలస, తదితర గ్రామాల్లో ముంపునకు గురైన తంపర పొలాలను శుక్రవారం పరిశీలించారు. విత్తనశుద్ధి, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. వరినాట్లు వేసేటపుడు వరి నారు చివర తుంచి వేసుకోవాలన్నారు.

JOIN

Post a Comment

కొత్తది పాతది