ఈ రెండు నెలలు సాధారణ వర్షాలే : ఐఎండీ

TS Weather Update | ఈ రెండు నెలలు సాధారణ వర్షాలే : ఐఎండీ

TS Weather Update |  న్యూఢిల్లీ, జూలై 31: నిన్నటివరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన దేశంలో రానున్న రెండు నెలలపాటు (ఆగస్టు, సెప్టెంబర్‌లో) సాధారణ స్థాయి వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

దేశంలోని తూర్పు మధ్య ప్రాంతాలతోపాటు ఈశాన్య, హిమాలయ ప్రాంతాల్లోని చాలా సబ్‌డివిజన్లలో సాధారణ స్థాయి నుంచి అంతకంటే అధిక స్థాయి వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నది. దేశంలోని ద్వీపకల్ప భాగంతోపాటు పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సాధారణ స్థా యి కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర సోమవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది