హాస్టళ్లలో ఉంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడుతున్నాయి. హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీని విధించబోతున్నట్లు అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించింది.

GST | న్యూఢిల్లీ, జూలై 29: హాస్టళ్లలో ఉంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడుతున్నాయి. హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీని విధించబోతున్నట్లు అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించింది. హాస్టళ్లు, డార్మిటార్‌లు నివాస గృహల పరిధిలోకి రావని, దీంతో జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదని బెంగళూరుకు చెందిన ఏఏఆర్ ప్రత్యేక బెంచ్‌లు ఈ తీర్పును వెలువరించింది.
బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీస్ స్టే ఎల్‌ఎల్‌పీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏఏఆర్..హాస్టళ్లు నివాస గృహాలు కావని, ఇవి వసతి సేవలు అందించడానికి అధికంగానే వసూలు చేస్తున్నాయని తెలిపింది. రోజుకు రూ.1,000 వరకు తీసుకునే హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్లకు జీఎస్టీ మినహాయింపు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ నిర్ణయం జూలై 17, 2022 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: TODAY HEADLINE NEWS
కామెంట్‌ను పోస్ట్ చేయండి