వన్డే క్రికెట్ చరిత్రలో జడేజా-కుల్‌దీప్ రికార్డు.. ఇదే తొలిసారి .Team India

 వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్లు జడేజా, కుల్‌దీప్ చరిత్ర సృష్టించారు. భారత జట్టు తరఫున ఒక వన్డేలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లుగా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 43 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు.

Team India: వన్డే క్రికెట్ చరిత్రలో జడేజా-కుల్‌దీప్ రికార్డు.. ఇదే తొలిసారి

వెస్టిండీస్‌(West Indies)తో బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్లు జడేజా, కుల్‌దీప్ చరిత్ర సృష్టించారు. భారత జట్టు తరఫున ఒక వన్డేలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లుగా రికార్డు (Record) నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ నాలుగు వికెట్లు తీయగా జడేజా మూడు వికెట్లు సాధించాడు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. చాహల్ నుంచి తీవ్ర పోటీ ఉన్నా కుల్‌దీప్‌కు అవకాశం రాగా అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ముఖ్యంగా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు మెయిడిన్లు వేయడమే కాకుండా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. మరోవైపు జడేజా కూడా ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు సాధించాడు. హిట్‌ మెయిర్, రోవ్‌మన్ పావెల్ లాంటి హిట్టర్లను ఔట్ చేశాడు. వీళ్లిద్దరూ కలిసి ఏడు వికెట్లు సాధించారు. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరఫున లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. దీంతో 49 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన తొలి జంటగా జడేజా-కుల్‌దీప్ నిలిచారు.

ఇది కూడా చదవండి: WI Vs IND 1st ODI: బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే..?

మరోవైపు తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్‌ మరో ఘనత సాధించింది. విండీస్‌పై భారత్‌ వరుసగా తొమ్మిది విజయాలను నమోదు చేసింది. వన్డేల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను కోల్పోయినా అత్యధిక బాల్స్ తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మరో 163 బంతులు ఉండగానే టీమిండియా గెలిచింది. అయితే 2013లో ఆసీస్‌పై శ్రీలంక 180 బాల్స్ ఉండగానే విజయం సాధించింది. అంతేకాకుండా అతి తక్కువ ఓవర్లలోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం భారత్‌కు ఇది నాలుగో సారి. 2014లో బంగ్లాదేశ్‌ను 17.4 ఓవర్లలో, 2023లో శ్రీలంకను 22 ఓవర్లలో, మళ్లీ శ్రీలంకనే 2003లో 23 ఓవర్లలో, తాజాగా వెస్టిండీస్‌ను 23 ఓవర్లలోనే భారత్‌ ఆలౌట్‌ చేసింది.

JOIN

Post a Comment

أحدث أقدم