128 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7.. ఇవీ డిటైల్స్..! || Infinix Smart 7

 Infinix Smart 7 | 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7.. ఇవీ డిటైల్స్..!

Infinix Smart 7 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్7లో న్యూ స్టోరేజీ ఆప్షన్ ఫోన్ తీసుకొచ్చింది. గత ఫిబ్రవరి ఏడో తేదీన 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరించింది. తాజాగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ తీసుకొచ్చింది. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్‌లో 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.7,999లకే అందుబాటులోకి తెచ్చింది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్7 ఫోన్ 4జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ యూనిసోక్ ఎస్సీ9863 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ ఏఐ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఎమరాల్డ్ గ్రీన్, నైట్ బ్లాక్, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

6.6-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 1612×720 రిజొల్యూషన్, 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. పీక్ బ్రైట్ నెస్ 500 నిట్స్ ఉంటుంది. ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 7 ఫోన్ ఆండ్రాయిడ్ 12 విత్ ఎక్స్ఓఎస్ 12 ఔట్ ఆఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది.

13-మెగా పిక్సెల్ ప్రైమరీ ఏఐ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ అలాంగ్ సైడ్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది.

ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 7 ఫోన్ 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. అతి తక్కువ ధరలో భారీ బ్యాటరీ సపోర్ట్ గల ఫోన్ ఇదే. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సాఫ్ట్ వేర్ బేస్డ్ ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.2, వై-ఫై, జీపీఎస్ తదితర కనెక్టివిటీ ఫీచర్లు కలిగి ఉంటుంది.

JOIN

Post a Comment

కొత్తది పాతది