రిలయన్స్ జియో తన యూజర్ల కోసం చౌకధరలో మరో లాప్ టాప్ జియో బుక్-2023 తెచ్చింది. దీని ధర రూ16,499 మాత్రమే || JioBook – 2023

 JioBook – 2023 | మార్కెట్లోకి జియో లాప్‌టాప్-2023.. ధరెంతంటే..?!

JioBook – 2023 |విద్యార్థులు మొదలు ప్రొఫెషనల్స్ నుంచి వ్యాపారవేత్తలు, చార్టర్డ్ అకౌంటెంట్ల వరకూ.. వైద్యుల నుంచి న్యాయవాదుల వరకూ.. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ తోపాటు లాప్‌టాప్ కూడా అవసరమే. అందరి అవసరాలకు అనుగుణంగా రిలయన్స్ జియో మార్కెట్లోకి కొత్త మోడల్ లాప్‌టాప్ తీసుకు వచ్చింది. బ్లూ కలర్‌లో ఆవిష్కరించిన ఈ లాప్ టాప్.. దేశంలోనే ఫస్ట్ లెర్నింగ్ బుక్ (First Learning Book) అని రిలయన్స్ జియో చెబుతున్నది.

తొలి నుంచి చౌక ధరకే తమ ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న జియో.. గతేడాది మార్కెట్లోకి తెచ్చిన జియో బుక్‌కు కొనసాగింపుగా న్యూ జియో బుక్-2023 యూజర్లకు పరిచయం చేసింది. దీని ధర కేవలం రూ.16,499 మాత్రమే. ఆగస్టు ఐదో తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ ఆన్ లైన్ స్టోర్లు, ఆఫ్ లైన్ స్టోర్లు, అమెజాన్ డాట్ ఇన్ వెబ్ సైట్ లోనూ కొనుక్కోవచ్చు.

Jiobook2023 1

11.6 అంగుళాల యాంటీ గ్లేర్ హెచ్ డీ డిస్ ప్లే గల ఈ లాప్‌టాప్.. ఇన్‌ఫినిటీ కీబోర్డుతో వస్తున్నది. ఎంటీ8788 ఒక్టాకోర్ ప్రాసెసర్‌తోపాటు 8 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. సీ/సీ++, జావా, పైథాన్, పెరల్ తదితర విభిన్న లాంగ్వేజ్‌లకు సపోర్ట్‌గా నిలుస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.

4జీ-ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై విత్ సపోర్ట్ ఫర్ 75+ కీబోర్డ్ షార్ట్ కట్స్, మల్టీ టాస్కింగ్ స్క్రీన్స్, జియో టీవీ యాప్ నుంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ లభిస్తుంది. వీడియో కాల్స్ కోసం 2-మెగాపిక్సెల్ హెచ్డీ హెచ్ కెమెరాతోపాటు ఏఆర్ఎం మాలీ జీ72 గ్రాఫిక్ కార్డు జత చేశారు.

గతేడాది విడుదల చేసిన లాప్ టాప్ బరువు 1.2 కిలోలు కాగా, తాజా జియో బుక్ 999 గ్రాములు మాత్రమే ఉంటుంది. యూఎస్బీ, హెచ్డీఎంఐ, ఆడియో వంటి ఇన్ పోర్ట్‌లతో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. జియో బుక్-2023 లాప్‌టాప్ ఏడాదిపాటు క్విక్ హీల్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్‌తో వస్తున్నది. ఇన్ఫినిటీ కీ బోర్డుతోపాటు పెద్ద ట్రాక్ పాడ్, జియో+ఎఫ్ ఫుల్ స్క్రీన్ మోడ్, స్టీరియో స్పీకర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

JOIN

Post a Comment

కొత్తది పాతది