నేడు రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం.. వరద నష్టంతో పాటు సుమారు 40 నుంచి 50 అంశాలపై సమ‌గ్రంగా చ‌ర్చ‌..! || Telangana

 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది.

Telangana | నేడు రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం.. వరద నష్టంతో పాటు సుమారు 40 నుంచి 50 అంశాలపై సమ‌గ్రంగా చ‌ర్చ‌..!
  • భారీ వర్షాల నేపథ్యంలో విస్తృత చర్చ
  • మంత్రివర్గ ఎజెండాలో 50 అంశాలు
  • పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైనా చర్చించనున్నది. ప్రత్యామ్నాయ సాగు విధానాలపైనా చర్చించే అవకాశం ఉన్నది. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది.

యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే చర్యలపై చర్చించనున్నది. పాతబస్తీలో మెట్రో రైలు పనులను త్వరగా పూర్తి చేస్తామని ఐటీ మం త్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెట్రో రైలు పొడిగింపుపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యా ల పెంపు తదితర అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నది. ప్రభు త్వ ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. గృహలక్ష్మి పథకం అమలుతోపాటు బీసీ, మైనారిటీబంధు అమలుపైనా చర్చ జరుగనున్నది. మరికొన్ని కొత్త నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభ లో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా క్యాబినెట్‌ చర్చించనున్నది.

JOIN

Post a Comment

أحدث أقدم