చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్'. మోహర్ రమేష్ దర్శకుడు. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచింది. ఇటీవలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

Bhola Shankar | చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచింది. ఇటీవలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో చిరంజీవి, కీర్తిసురేష్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. ‘అన్నాచెల్లెళ్ల అనుబంధం ఈ కథకు ఆయువు పట్టులా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’ అని చిత్ర బృందం పేర్కొంది. రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదిరతులు నటిస్తున్న ఈ చిత్రానికి మహతిస్వరసాగర్ సంగీతాన్నందిస్తున్నారు.
إرسال تعليق