ప్రతీ పాపులర్ పుస్తకం ఒక సెలబ్రిటీనే! అలాంటి పుస్తకాలు తారల చేతుల్లో కనిపిస్తే.. మరింత కుతూహలం ఏర్పడుతుంది. ఆ మధ్య రష్మిక మందన్నాతన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని మంచి పుస్తకాలను పోస్టు చేసింది.. ‘ఇవన్నీ చదివి ప్రేరణ పొందాను.. మీరు కూడా చదవండ’ని సిఫారసు చేసింది.. ‘నాకు నచ్చాయ్.. మరి మీకూ’ అంటున్న రష్మిక ఫేవరెట్ బుక్స్ గురించి తెలుసుకుందాం..

ప్రతీ పాపులర్ పుస్తకం ఒక సెలబ్రిటీనే! అలాంటి పుస్తకాలు తారల చేతుల్లో కనిపిస్తే.. మరింత కుతూహలం ఏర్పడుతుంది. ఆ మధ్య రష్మిక మందన్నా(Rashmika mandanna) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని మంచి పుస్తకాలను పోస్టు చేసింది.. ‘ఇవన్నీ చదివి ప్రేరణ పొందాను.. మీరు కూడా చదవండ’ని సిఫారసు చేసింది.. ‘నాకు నచ్చాయ్.. మరి మీకూ’ అంటున్న రష్మిక ఫేవరెట్ బుక్స్ గురించి తెలుసుకుందాం.. (Rashmika about her favorite Books)
‘వెన్ బ్రీత్ బికమ్స్ ఎయిర్’
‘ఇక, నువ్వు ఎన్నో రోజులు బతకలేవు..’’ ఎంత గుండెధైర్యమున్న వాడికైనా మరణం తెలిసినప్పుడు ఊపిరి ఆగిపోతుంది. ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆంగ్లసాహిత్యం, స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో వైద్యశాస్త్రం చదివి.. పదేళ్లు న్యూరోసర్జన్‌గా శిక్షణ పూర్తి చేసుకుని.. ఎందరో ప్రాణాలను కాపాడిన వైద్యుడే ఇలాంటి చావుకబురు వినాల్సిరావడం ఎంత ఘోరం? 36 ఏళ్ల పవుల్ కళానిధికి ఆ పరిస్థితే ఎదురైంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరలాజికల్ సర్జరీ వంటి అత్యున్నత పరిశోధనా అవార్డు తీసుకున్న ఆయన తన మరణాన్ని తను కనిపెట్టలేకపోయాడు. ‘నీకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. క్షమించండి ఎక్కువ రోజులు బతకలేరు’ అంటూ తోటి వైద్యుడు చెప్పాక.. భార్య, పిల్లలు కళ్లలో మెదిలారు. మనసును దిటవు చేసుకోక తప్పలేదు. మరణాన్ని మౌనంగా అంగీకరించి.. ఆ కాసిన్ని రోజులైనా అర్థవంతంగా జీవిద్దామనుకున్నాక మళ్లీ పుట్టినట్లయింది. అయితే ఏడాదికే కన్నుమూశాడాయన. డాక్టర్ అనుభవించిన మరణపు ముందురోజులకు అక్షరరూపమే ఈ పుస్తకం. బతుక్కు చావుకు మధ్య కొట్టుమిట్టాడే జీవన్మృతులకు ప్రాణవాయువు.. పవుల్ కళానిధి జీవితం.
إرسال تعليق