మంచిర్యాల పట్టణం మళ్ళీ నీట మునిగింది.

 మంచిర్యాల పట్టణం మళ్ళీ నీట మునిగింది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు చేరడంతో నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో పాటు రాళ్ళవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు గోదావరిలోకి చేరలేక పోటెత్తడంతో మంచిర్యాలలోని పలు కాలనీలు, మాతాశిశు ఆస్పత్రి నీట మునిగాయి. ముందస్తుగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గతేడాది పరిస్థితే మళ్ళీ పునరావృతం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీయడంతోపాటు ఇంటిని ముట్టడించారు. పలు మండలాల్లో పంట పొలాల్లో నీరు చేరడంతో నష్టం వాటిల్లింది.

జలదిగ్బంధంలో జిల్లా కేంద్రం

మంచిర్యాల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లా కేంద్రం జలదిగ్బంధమైంది. ఎల్లంప ల్లి ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 48 గేట్లు తెరిచి నీటిని దిగువన గోదావరి లోకి వదిలారు. గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగడంతో పరీ వాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు నీరు అందులోకి వెళ్లే వీలులేక పోటు కమ్మింది. దీంతో పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, ఆదిత్య ఎన్‌క్లేవ్‌ ఏరియాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో ఆరు అడుగుల మేర వరద నీరు చేరింది. పరిస్థితిని ముందే అంచ నా వేసిన అధికారులు ఆయా కాలనీల ప్రజలను ముందస్తు గా పునరావాస కేంద్రాలకు తరలించడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ కారణంగా కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని వేలాది ఎకరాల పత్తి పంట పూర్తిగా నీట మునిగింది.

నీట మునిగిన మాతా శిశు కేంద్రం

గోదావరి నది సమీపంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేం ద్రం మళ్లీ ముంపునకు గురైంది. గతేడాది జూలై 12న కురిసిన భారీ వర్షాలకు ఆస్పత్రి నీట మునగగా, మరమ్మతుల అనంత రం మూడు నెలల క్రితమే భవనాన్ని అందుబాటులోకి తెచ్చా రు. తాజాగా గోదావరిలోకి భారీగా వరద చేరడంతో శుక్రవా రం ఆస్పత్రి భవనం మరోసారి నీట మునిగింది. గోదావరికి వెళ్లే రహదారి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు అవ కాశం లేకుం డా భవనం చుట్టూ నీళ్లు చేరాయి. అధికారులు ముందు జాగ్రత్తగా రోగులను జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వరుసగా రెండు సంవత్సరాలు భవనం నీట మునగడంతో పాలకులు, అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు చూపు లేకుండా గోదావరి ఒడ్డున ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆస్పత్రిని శాశ్వతంగా మరో చోటుకు మార్చాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 13.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 13.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గరిష్టంగా కాసిపేట మండలం లో 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాండూరు మండలంలో అత్యల్పంగా 2.1 మిల్లీమీటర్లు కురిసింది. అలాగే జన్నారంలో 33.2 మిల్లీమీటర్లు, దండేపల్లి 28.4, హాజీపూర్‌ 20.0, కోటపల్లి 14.2, చెన్నూరు 31.1, భీమిని 10.8, మంద మర్రి 10.7, మంచిర్యాల 9.9, లక్షెట్టిపేట 9.6, నస్పూర్‌ 7.9, కన్నెపల్లి 6.8, భీమిని 5.1, జైపూర్‌ 4.3, నెన్నెల 2.9, వేమనపల్లి 2.7, బెల్లంపల్లి 2.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద...

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 486.92 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 478.26 అడుగులకు చేరింది. గరిష్ట నిల్వ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.466 టీఎంసీలు ఉంది. రిజర్వా యర్‌లోకి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 2,33,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, కడెం ప్రాజెక్టు నుంచి 48010 క్యూసెక్కులు, ఎగువున కురుస్తున్న వర్షాల కారణంగా మరో 3,63,861 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాయంత్రం 6 గంటల సమయంలో 48 గేట్లు ఎత్తి 6,94,482 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు.

ఓసీపీల్లో నిలిచిన బొగ్గు తవ్వకాలు...

పది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివి జన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. క్వారీల్లో నీరు నిలిచి పోవడంతో పనులు జరగడం లేదు. దీంతో యంత్రాల సహా యంతో నీటిని తోడుతున్నారు. మూడు ఏరియాల్లోని ఇందా రం, రామకృష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీ పీల్లో దాదాపు రూ.65 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తితోపాటు, రూ. 20 కోట్ల విలువైన ఓబీ మట్టి తవ్వకాల పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

JOIN

Post a Comment

أحدث أقدم