‘కాంత’ కోసం ఒక్కటవుతోన్న రానా, దుల్కర్..

 రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ ‘కాంత’కి ప్రాణం పోసేందుకు చేతులు కలిపారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో స్పిరిట్ మీడియా మరియు వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ‘కాంత’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని శుక్రవారం దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

Kaantha: ఈ ‘కాంత’ కోసం ఒక్కటవుతోన్న రానా, దుల్కర్..
Kaantha Movie First Look

రానా దగ్గుబాటి (Rana Daggubati) మరియు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘కాంత’ (Kaantha)కి ప్రాణం పోసేందుకు చేతులు కలిపారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో స్పిరిట్ మీడియా మరియు వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ‘కాంత’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని శుక్రవారం దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రానాకు చెందిన స్పిరిట్ మీడియా, దుల్కర్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం బహుబాషా చిత్రంగా ఉండబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.


దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ మీడియా (Spirit Media) నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘స్పిరిట్ మీడియాను విశ్వవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో సినిమాలు నిర్మించాలని స్థాపించడం జరిగింది. ఈ ‘కాంత’ చిత్రం నిస్సందేహంగా ఆ స్థాయికి చెందిన చిత్రమని చెప్పగలను. టాలెంటెడ్ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌‌తో ఈ సినిమాతో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. నా స్నేహితుడు దుల్కర్‌కి, అతని అభిమానులకు ఇస్తున్న గిఫ్ట్ ఈ ఫస్ట్ లుక్. దుల్కర్ ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు’’ అని తెలిపారు.

Rana.jpg


వేఫేరర్ ఫిలింస్ (Wayfarer Films) వ్యవస్థాపకుడు, నటుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ ‘కాంత’ నా హృదయానికి చాలా దగ్గరైంది. నేను ఈ కథ విన్న రోజు నుండి దీనిని జీవం పోయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే.. ఇది మన ఇండియన్ సినిమాలో చూసిన వాటికి భిన్నంగా ఉంటుంది. స్పిరిట్ మీడియాతో కలిసి నిర్మించడం.. అలాగే నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ పాత్రలలో ఒకటి‌గా ఇది ఉండబోతుండటంతో.. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఎంతగానో వేచి చూస్తున్నానని అన్నారు.

నేను ఎంతో ఇష్టపడే రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తుల నమ్మకంతో ఈ ‘కాంత’ చిత్రాన్ని తెరకెక్కించబోతుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి దుల్కర్ నటన హైలెట్‌గా ఉంటుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) తెలిపారు.


JOIN

Post a Comment

أحدث أقدم