మామాఅల్లుళ్ల బ్రోమాన్స్‌ అదిరిందంటూ..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమా విడుదలవుతుందంటే ఆ కోలాహలమే వేరుగా ఉంటుంది. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే మామూలుగా ఉంటుందా? థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాంటి హడావిడి మధ్య విడుదలైంది ‘బ్రో’ (Bro Twitter Review) చిత్రం.


పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమా విడుదలవుతుందంటే ఆ కోలాహలమే వేరుగా ఉంటుంది. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే మామూలుగా ఉంటుందా? థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాంటి హడావిడి మధ్య విడుదలైంది ‘బ్రో’ (Bro Twitter Review) చిత్రం. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన వినోదాయ సిత్తం’ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, మాటలు అందించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానులు సందడి, సంబరాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టే ఓవర్సీస్‌ నుంచి మంచి టాక్‌ వచ్చింది. ఇది కంప్లీట్‌ పవర్‌స్టార్‌ స్టప్‌ అనీ, అభిమానులు పవన్‌ నుంచి ఏం కోరుకుంటారో అదంతా సినిమాలో ఉంది చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో పవర్‌ స్వాగ్‌ అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ అంటున్నారు. మరి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

కామెడీ, పవన్‌ కళ్యాణ్‌ మేనరిజంతో ప్రథమార్ధం వినోదాత్మకంగా ఉందని, మొత్తంగా అయితే డీసెంట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఆయన పాత సినిమాల్లో గెటప్‌లు, పాటలను సందర్భానుసారంగా తీసుకురావడం అభిమానులను ఉర్రూతలూగిస్తుందని చెబుతున్నారు. అయితే సెకెండాఫ్‌ కాస్త ల్యాగ్‌ ఉందని కామెంట్‌ చేస్తున్నారు. కొందరైతే ఇది పవన్‌ అభిమానుల కోసమేనని చెబుతున్నారు. ఎమోషనల్‌ సీన్స్‌ అంతగా ఆకట్టుకోవని అంటున్నారు. పాటలు, నేపథ్య సంగీతానికి మంచి మార్కులే పడుతున్నాయి. మామా అల్లుళ్ల బ్రోమాన్స్‌ బాగుందని కామెంట్స్‌ చేస్తున్నారు. సెకెండాఫ్‌ కాస్ల స్లోగా నడిచిందట.

కొందరైతే ఫస్టాఫ్‌కి 3.25 రేటింగ్‌ ఇచ్చారు. డైలాగ్స్‌, స్ర్కీన్‌ప్లే రేసీగా ఉన్నాయని చెబుతున్నారు. మామ అల్లుళ్ల కాంబో అదిరిందని, ఇంటర్వెల్‌ బ్లాక్‌ సూపర్‌ అని ఆనందిస్తున్నారు అభిమానులు. పవన్‌కల్యాణ్‌ మోడ్రన్‌ ఆలా్ట్ర స్టైల్‌లో అదరగొట్టారని ప్రశంసిస్తున్నారు.

Bro Twitter review: మామాఅల్లుళ్ల బ్రోమాన్స్‌ అదిరిందంటూ..

JOIN

Post a Comment

కొత్తది పాతది