వివాదాస్పద టైటిల్ తో రజినీకాంత్ సినిమా !

 రజినీకాంత్, మోహన్ లాల్ నటిస్తున్న తమిళ సినిమా 'జైలర్' అగస్ట్ 10 న విడుదలవుతోంది. అదే రోజు మలయాళం సినిమా అదే 'జైలర్' టైటిల్ తో సక్కీర్ మడతిల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా విడుదలవుతోంది. కేరళ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, కేరళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మలయాళం సినిమా దర్శకుడుకి సపోర్ట్ గా ఉంటే, తమిళ సినిమా నిర్మాతలు మాత్రం టైటిల్ చేంజ్ చెయ్యడం కుదరదు అదే టైటిల్ తో మలయాళం కూడా విడుదల చేస్తాం అని అంటున్నారు.ఇప్పుడు ఈ కేసు మద్రాస్ హై కోర్ట్ లో వుంది, ఆగష్టు 2 కి వాయిదా వేశారు అని తెలిసింది.

Rajinikanth: జైలర్ vs జైలర్, వివాదాస్పద టైటిల్ తో రజినీకాంత్ సినిమా !
Jailer vs Jailer

ఆగస్టు నెల వస్తోంది అంటే దక్షిణ భారత దేశ చలనచిత్ర పరిశ్రమలో చాలా ముఖ్యమైన నెల. ఎందుకంటే చాలా పెద్ద నటుల, పెద్ద బడ్జెట్, పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి ఆగస్టు నెలలో. అందులో రజనీకాంత్ (Rajinikanth), మోహన్ లాల్ (MohanLal) నటించిన 'జైలర్' (Jailer) ఒకటి కాగా, చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళా శంకర్' #BholaaShankarకూడా విడుదల అవుతోంది. అలాగే మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) నటించిన 'కింగ్ అఫ్ కొత్త' (KingOfKotha) అనే సినిమా కూడా విడుదలవుతోంది. అక్షయ్ కుమార్ (AkshayKumar) నటించిన హిందీ సినిమా 'ఓఎంజి 2' (OMG2) కూడా ఆగస్టులోనే విడుదల అవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మలయాళం దర్శకుడు సక్కీర్ మడతిల్ (Sakkir Madathil) తను నిర్మించే సినిమాకి కూడా 'జైలర్' #Jailer అని టైటిల్ పెట్టాను అని, అయితే రజినీకాంత్ నటించిన తమిళ సినిమా 'జైలర్' #Jailer కన్నా తానె ముందుగా కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నాను అని చెప్తున్నాడు.

jailer2.jpg

అదే విషయం అతను రజినీకాంత్ నటించిన తమిళ సినిమా 'జైలర్' ప్రొడ్యూసర్స్ సన్ పిక్టర్స్ వాళ్ళకి చెపితే, వాళ్ళు తమిళ సినిమా టైటిల్ చేంజ్ చెయ్యడం కుదరదు అని చెప్పినట్టుగా కూడా తెలిసింది. అయితే తమిళ సినిమా 'జైలర్', అదే పేరుతో మలయాళంలో విడుదలైతే అది తన సినిమాకి చాలా పెద్ద దెబ్బ అని చెప్తున్నాడు దర్శకుడు సక్కీర్. అదీ కాకుండా తమిళ 'జైలర్' సినిమాలో రజినీకాంత్ తో పాటు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా వున్నారు. అందువల్ల అది మలయాళం 'జైలర్' కి దెబ్బతీసే అవకాశం వుంది అని అనుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో మాత్రం కేరళ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, అలాగే కేరళ ప్రొడ్యూసర్స్ మలయాళం దర్శకుడికి బాసటగా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఆగష్టు 10 వ తేదీనే విడుదలవడం ఆసక్తికరం. మరి తమిళ సినిమా టైటిల్ మలయాళంలో కూడా అదే టైటిల్ తో విడుదల చేస్తారా, లేక మారుస్తారా అన్న విషయం ఇంకా తేలాలి. అయితే ఈమధ్య ఒకే టైటిల్ తో రెండు సినిమాలు వచ్చినప్పుడు ఆ స్టార్ పేరు ముందు జతచేసి ఆ టైటిల్ పెడుతున్నారు. ఉదాహరణకి 'ఖలేజా' టైటిల్ విషయంలో వివాదం వచ్చినప్పుడు 'మహేష్ ఖలేజా' (MaheshBabu) అని అలాగే 'కత్తి' సినిమా టైటిల్ వివాదంలో 'కళ్యాణ్ రామ్ కత్తి' అని టైటిల్ మార్చారు. స్టార్ పేరు ఎంత ముందు పెట్టినా ముందు అనుకున్న టైటిల్స్ మాత్రమే ప్రజల్లోకి వెళ్లిపోతాయి.

jailer1.jpg

అయితే తన సినిమా రూ.5 కోట్లు బడ్జెట్ పెట్టి తీశానని, అది తనకు చాలా పెద్ద అమౌంట్ అని, దానికోసం చాలా అప్పులు, లోన్స్ ఇంకా చాలా చేయాల్సి వచ్చిందని అందుకోసమేనా సన్ పిక్టర్స్ ఆలోచించాలని చెప్పాడు మలయాళం దర్శకుడు. రజినీకాంత్ 'జైలర్' సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు కాగా, తమన్నా భాటియా (TamannahBhatia) కథానాయకురాలు. ఇప్పుడు ఇద్దరూ మద్రాసు హై కోర్ట్ గుమ్మం ఎక్కారు ఈ టైటిల్ కోసం. ఈ కేసును ఆగష్టు 2 కి వాయిదా వేసినట్టుగా తెలిసింది.

రజినీకాంత్ 'జైలర్' విడుదల విషయం లో ఇప్పుడు కొంచెం ఆసక్తి నెలకొని వుంది. ఎందుకంటే కోర్ట్ లో ఆగస్ట్ 2 న ఏమి చెపుతుందో, టైటిల్ మార్చమని లేదా మలయాళం సినిమా టైటిల్ మార్చుకోమని, ఏమి వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలాగే రెండు సినిమాలు ఒకేసారి అంటే ఆగష్టు 10వ తేదీనే విడుదల అవుతూ ఉండటం ఆసక్తికరం. ఒకటి తమిళ సినిమా, ఒకటి మలయాళం సినిమా. ఒకటి హై బడ్జెట్ సినిమా, ఒకటి చిన్న సినిమా. మలయాళం సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా తీసిన సినిమా అని దర్శకుడు చెపుతున్నాడు.

JOIN

Post a Comment

కొత్తది పాతది