విపక్షాల కూటమి ఇండియా తదుపరి సమావేశం ముంబైలో

 విపక్షాల కూటమి ఇండియా తదుపరి సమావేశం ముంబైలో జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 24-25 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సమావేశం ఉండనుంది. గత రెండు నెలల్లో కూటమి సమావేశమవుతుండటం ఇది మూడోసారి. తొలి సమావేశం పాట్నాలో జరుగగా, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది.

INDIA meet: ఇండియా కూటమి మూడో సమావేశం ఖరారు

న్యూఢిల్లీ: విపక్షాల కూటమి ఇండియా (INDIA) తదుపరి సమావేశం ముంబై (Mumbai)లో జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 24-25 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సమావేశం ఉండనుంది. గత రెండు నెలల్లో కూటమి సమావేశమవుతుండటం ఇది మూడోసారి. తొలి సమావేశం పాట్నాలో జరుగగా, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. జూలై 18న జరిగిన బెంగళూరు సమావేశంలోనే కూటమి పేరును ఖరారు చేశారు. 26 విపక్ష పార్టీలు బెంగళూరు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరుకావడం ఈ సమావేశాల్లో హైలైట్‌గా నిలిచింది. జూన్ 23న పాట్నాలో నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన విపక్షాల సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి.


ముంబైలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో కో-ఆర్డినేషన్ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర ప్యానల్స్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.


11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ..

కాగా, ముంబై సమావేశంలో 11 మంది సభ్యులతో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి అధ్యక్షుడు, కన్వీనర్‌ను కూడా ముంబై సమావేశంలో ఎంచుకుంటారు.

JOIN

Post a Comment

أحدث أقدم