ప్రపంచకప్ గెలిచే జట్టేనా ఇది?

 ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌‌ను భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల జట్టు ఎంపిక తీరు పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి. 114 పరుగులు ఛేజ్ చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్ వంటి జట్టు మీదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Trolls on Team India: క్వాలిఫై కాని జట్టుపై ఇలా ఆడతారా? ప్రపంచకప్ గెలిచే జట్టేనా ఇది?

టీమిండియా కొన్నేళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ వరకు వెళ్లిందే తప్ప గెలిచిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌‌ను భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల జట్టు ఎంపిక తీరు పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి. టీమిండియా గెలిచిన తీరు కూడా ఎవ్వరికీ నచ్చలేదు. 115 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించేందుకు మన ఆటగాళ్లు ఆపసోపాలు పడ్డారు. దీంతో భారత్‌కు అసలు ప్రపంచకప్ గెలిచేంత సీనుందా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

టీమిండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. రోహిత్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, జడేజా లాంటి ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా జట్టును గెలిపించగలరు. అయితే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడం విన్నింగ్ కాంబినేషన్‌ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా వీళ్ల స్థానాల్లో ఆడుతున్న శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ నిలకడగా ఆడటం లేదు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన గిల్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తేలిపోతుండటం జట్టును కలవరపరుస్తోంది. అటు సూర్యకుమార్ కూడా టీ20ల తరహాలో వన్డేల్లో ఆడలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో తొలివన్డేలో మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను పంపారు. అయితే అతడు కేవలం 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ టెస్ట్ సిరీస్‌లో రాణించలేదు. వన్డేల్లో అతడికి సంజు శాంసన్ నుంచి పోటీ ఉండటంతో తొలి వన్డేలో తప్పనిసరి పరిస్థితుల్లో సత్తా చాటాడు.

ఇది కూడా చదవండి: Team India: వన్డే క్రికెట్ చరిత్రలో జడేజా-కుల్‌దీప్ రికార్డు.. ఇదే తొలిసారి

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 114 పరుగులు ఛేజ్ చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్ వంటి జట్టు మీదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచకప్‌కు క్వాలిఫై కాని జట్టుపై ఇలాగే ఆడతారా అంటూ మండిపడుతున్నారు. వరల్డ్ కప్‌కు కనీసం క్వాలిఫై అవని జట్టే టీమిండియాను ఇంతలా ఇబ్బంది పెట్టిందంటే.. ఈసారి కూడా వరల్డ్ కప్‌ అందుకోవడం భారత్ వల్ల కాదని కొందరు అంటున్నారు. మరి మిగతా రెండు వన్డేల్లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

JOIN

Post a Comment

أحدث أقدم