SSC CPO Notification | డిగ్రీ అర్హ‌త‌తో.. కేంద్ర బలగాల్లో 1876 ఎస్‌ఐ పోస్టులు.

 SSC CPO 2023 Notification | సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, ఢిల్లీ పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

SSC CPO Notification | డిగ్రీ అర్హ‌త‌తో.. కేంద్ర బలగాల్లో 1876 ఎస్‌ఐ పోస్టులు

SSC CPO 2023 Notification | సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, ఢిల్లీ పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంచి జీత భత్యాలు, భద్రమైన కొలువు, దేశసేవ చేసుకునే అవకాశంతోపాటు చక్కటి పదోన్నతులతో కూడిన ఈ పోస్టుల భర్తీ గురించి సంక్షిప్తంగా….

మొత్తం ఖాళీలు : 1876
పోస్టులు : సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఐ)

జీతభత్యాలు : లెవల్‌-6 ప్రకారం 1,12,400/-

అర్హతలు

  • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు 2023, ఆగస్టు 15 నాటికి అర్హత సాధించాలి.
  • తప్పనిసరిగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
    వయస్సు
  • 2023, ఆగస్టు 1 నాటికి 20 -25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, ఆగస్టు 2 నుంచి 2003, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఢిల్లీ పోలీస్‌ శాఖకు సంబంధించి వయోపరిమితిలో సడలింపు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
    ఎంపిక విధానం
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), పీఈటీ/పీఎస్‌టీ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా చేస్తారు
    సీబీటీ
  • రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు.
  • పేపర్‌-1లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 50 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
  • మొత్తం 200 ప్రశ్నలు- 200 మార్కులు
  • పరీక్ష కాలవ్యవధి 2 గంటలు
  • పేపర్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌ నుంచి 200 ప్రశ్నలు – 200 మార్కులు.
  • పరీక్ష కాలవ్యవధి – 2 గంటలు
    నోట్‌: రెండు పేపర్లలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3వంతు మార్కులను కోత విధిస్తారు.

శాఖ                    ఖాళీలు

ఢిల్లీ పోలీస్‌         162
బీఎస్‌ఎఫ్‌            113
సీఎస్‌ఐఎఫ్‌        630
సీఆర్‌పీఎఫ్‌         818
ఐటీబీపీ                63
ఎస్‌ఎస్‌బీ              90
మొత్తం                 1876

పీఈటీ

  • 100 మీటర్ల దూరాన్ని పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగెత్తాలి.
  • 1.6 కి.మీ దూరాన్ని పురుషులు 6.5 నిమిషాలలో, మహిళలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాలలో
    పరుగెత్తాలి.
  • మూడు అవకాశాల్లో పురుషులు 3.65 మీటర్ల లాంగ్‌జంప్‌, మహిళలు అయితే 2.7 మీటర్ల దూరాన్ని లాంగ్‌జంప్‌ చేయాలి.
  • మూడు అవకాశాల్లో పురుషులు 1.2 మీటర్ల హైజంప్‌, మహిళలు అయితే 0.9 మీటర్ల హైజంప్‌ చేయాలి.
  • పురుషులు మూడు అవకాశాల్లో షాట్‌పుట్‌ను 4.5 మీటర్లు వేయాలి (16 ఎల్‌బీ). మహిళలకు షాట్‌పుట్‌ లేదు.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: ఆగస్టు 15
సీబీటీ తేదీలు: అక్టోబర్‌లో ఉంటాయి
వెబ్‌సైట్‌: https://ssc.nic.in

JOIN

Post a Comment

أحدث أقدم