మాగనూరు, మక్తల్ మండలాల్లో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి.

మాగనూరు/మక్తల్ రూరల్, జూలై 28 : మాగనూరు, మక్తల్ మండలాల్లో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామంతో పాటు, మక్తల్ మండలంలోని మంథన్‌గోడ్, కర్ని, చిట్యాల, లింగంపల్లి, జక్లేర్, పసుపుల, పంచ లింగాల, గుడిగండ్ల తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున అసన్, హుస్సేన్‌సాబ్‌ల సవారిని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పీర్లను గ్రామంలో ఊరే గించారు. భక్తులు దట్టీలు, పూలు, మాలీజా సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పీర్లను దర్శించుకున్న కుంభం
నారాయణపేట : మొహర్రం పండుగ దృష్ట్యా డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి శుక్రవారం నారాయణపేటలో తఖీబాబా దర్గాతో పాటు, పీర్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహర్రం పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపు కోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు తఖీబాబా దర్గాలో ప్రత్యేక ప్రా ర్థనలు చేయగా, పీఠాధిపతి సయ్యద్ గయా సుద్దీన్ ఖాద్రి కుంభంను శాలువాతో సత్కరిం చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సలీం, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు మహిమూద్ ఖు రేషి, రహమాన్ చాంద్, జలీల్‌బేగ్, హస్నొద్దీన్ తదితరులున్నారు. అదేవిధంగా, పట్టణంలోని ఊట్కూర్ మసీద్ వద్ద పీర్లను ఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు.
إرسال تعليق